కల్లూరు అర్బన్ 31 వార్డు రోడ్డుపైన కల్వట్ పని త్వరగా పూర్తి చేయాలని సిపిఎం నగర నాయకులు యేసురాజు, పి.మధు డిమాండ్ చేశారు. గురువారం రాఘవేంద్రనగర్‌లో నిలిచిపోయిన కల్వట్ పనిని తక్షణం పూర్తి చేయాలని కోరారు. కాలనీవాసులు సామెల్, దానమయ్య, తలారి వెంకటేశులు, అబ్దుల్లా తదితరులు మాట్లాడుతూ, రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, సమస్య తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.