బుధవారం రోజున రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని నూతనంగా ఏర్పాటైన మహిళా పోలీస్ స్టేషన్ సందర్శించి పలు ఫైళ్లను పరిశీలించారు మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి సమన్వయ పరచాలని అన్నారు కుటుంబాల సమస్యల నేపథ్యంలో వచ్చిన బాధితులకు రాజీమార్గం కుదిరించాలంటూ సూచనలు చేశారు నూతనంగా ఏర్పడిన పోలీస్ స్టేషన్పై ఎలాంటి మచ్చ రాకుండా బాధ్యతగా పోలీసు అధికారులు ముందడిగాలని తెలిపారు