పోలవరం ప్రాజెక్ట్ లో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ను శనివారం అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, జియాన్ఫ్రాన్కో డిసికో, డేవిడ్ బిపాల్ సందర్శించారు. నాణ్యత నియంత్రణ పరీక్షల తీరును అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటుగా కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్ , పి పి ఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జలసంఘం అధికారులు, సరబ్జిత్ సింగ్ భక్షి,రాకేష్ తోతేజ, సి ఎస్ ఎం ఆర్ ఎస్ అధికారులు మనీష్ గుప్తా ఉన్నారు. ఆ తరువాత గ్యాప్ 1, 2ల నిర్మాణం తదితరాలపై సమీక్షించారు.