రెబ్బెన వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు సోమవారం యూరియా కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.