జోనల్ పోటీల్లో విజేతలైన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచి తమ సత్తా చాటాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు మంగళవారం స్థానిక ఎస్సీ ఆర్ట్స్ కళాశాలలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ కప్ ముగింపు వేడుకలలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు అతి తక్కువ సమయంలో ఛాలెంజ్గా తీసుకొని తిరుపతి పట్టణంలో ఈ నెల 24 నుంచి 26 మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను దిగ్విజయంగా నిర్వహించామన్నారు.