ఏపీ ప్రభుత్వం రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లను నియమించింది. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన టిడిపి సీనియర్ నేత ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ కి డైరెక్టర్ పదవి వివరించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతూ పార్టీ బలోపేతానికి అయన కృషి చేశారు. కార్పొరేటర్ గా ఉంటూ బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకి డైరెక్టర్ పదవి రావడం పై బ్రాహ్మణ సంఘాలు తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.