జీవిత లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన, వాటిని సాధించడానికి ధృడ సంకల్పం ఉంటే ఐఎఎస్ వంటివి సాధించడం పెద్ద కష్టం కాదని విశాఖ మహ నగర పాలక సంస్థ (జివిఎమ్‌సి) కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిగా పాల్గొని ప్రసంగించారు. రాజస్థాన్‌లోని మారుమూల గ్రామం నుంచి ఎదిగిన తాను బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం మొదలుకొని 8 ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేస్తూ ఏవిధమైన శిక్షణ లేకుండా సివిల్స్‌లో విజయం సాధించి ఐఎఎస్‌కు ఎంపికైన తీరును ఆయన వివరించారు.