జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన ఆశా వర్కర్ మహంకాళి అశ్విని మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆర్థికంగా చికిత్స చేసుకునే స్తోమత లేకపోవడంతో స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ బోనగిరి నారాయణ, జాగిరి శ్రీనివాస్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు విన్నవించారు.దీంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సి ఎం సహాయ నిధి ద్వారా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం 3 లక్షల రూపాయల ఎల్వోసీ ని అశ్విని కుటుంబ సభ్యులకు బుధవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అందజేశారు. LOC మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే కు అశ్విని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.