ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆలయ ఈవో చక్రధరరావు తెలియజేశారు. శనివారం ఆలయం వద్ద శ్రీనివాస ప్రాంగణంలో ఉన్న తాత్కాలిక అన్నదాన ప్రదేశమును పరిశీలించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని ఆలయ అన్నదాన సిబ్బందికి ఆయన ఆదేశాలు ఇచ్చారు.