భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను బుధవారం ఉదయం 9 గంటలకు అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.ఈ క్రమంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు,అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ విద్యా వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం కట్టుబడిందని,ఈ నేపథ్యంలోనే విద్యావ్యవస్థ కోసం అనేక నిధులు కేటాయిస్తున్నామన్నారు, విద్యార్థులు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని,ఇదే క్రమంలో విద్యార్థుల ఆహారం పట్ల అలసత్వం వహిస్తే సిబ్బంది ఉపాధ్యాయులపై చర్యలు తప్పన్నారు.