జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ లో గల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వృద్ధులు వితంతువులు వికలాంగులకు పెన్షన్ పెంచాలంటూ వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.