ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మెడ పీ గ్రామంలో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భారీ నాగుపాము దర్శనమిచ్చి కలకలం రేపింది. ఇళ్ల మధ్యలోకి ఆకస్మాత్తుగా ఆరు అడుగుల పొడవైన నాగుపాము రావడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా స్నేక్ క్యాచర్ మల్లికార్జున వేగంగా చేరుకొని చాకచక్యంగా పామును పట్టుకున్నారు. స్థానికులు ఊపిరి పీల్చుకుంటూ అతని ధైర్యాన్ని ప్రశంసించారు. ఆ పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అధికారులు తెలిపారు.