కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం “Sunday’s on Cycle” కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రారంభించారు. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్ని సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ, ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఒక కీలక అడుగు అభివర్ణించారు. మనిషి ఆరోగ్యం కేవలం వ్యక్తిగత ప్రయోజనం మాత్రమే కాదని, సమాజాన్ని, దేశాన్ని బలోపేతం చేసే శక్తిగా మారుతుందన్నారు.