జీవీఎంసీ 88 వ వార్డు టిడ్కో గృహాలకు మౌళిక సదుపాయాల కల్పన కోసం అధికారులపై ఒత్తిడి తెస్తామని సిపిఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి కసి రెడ్డి సత్యనారాయణ స్పష్టం చేసారు. ఆదివారం టిడ్కో హౌసింగ్ ప్రాజెక్ట్ సముదాయం లో టిడ్కో గృహ లబ్ధి దారుల సమావేశం జరిగింది . ఈ సమావేశం లో కసి రెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ టిడ్కో గృహాలు నిర్మించి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు మౌలిక సదుపాయాలు కల్పించలేదని వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.