అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. అవనిగడ్డ తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు రెవిన్యూ, పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి, నది పరివాహక ప్రాంతాల ప్రజలకు సూచనలు జారీ చేశారు. మత్స్యకారులు తమ పడవలను నది ఒడ్డున లంగర్లు వేసి నిలిపివేశారు.