కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద గురువారం ఉదయం 10 గంటలకు సముద్రం మరింత భీకరంగా మారింది. కొత్తపట్నం దగ్గర భారీ అలలు రోడ్డుపైకి వస్తుండడంతో ప్రమాదం పొంచి ఉండటంతో స్థానికులు రాకపోకలను నిలిపివేశారు. అయినా కొందరు ప్రయాణికులు హెచ్చరికలను పట్టించుకోకుండా డివైడర్లను దాటి వెళ్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సముద్రం ఉద్ధృతంగా మారింది.