ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్లు ధరించాలంటూ తమ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని ఇరిగేషన్, శాఖ అధికారులు,ట్రాఫిక్ పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, డిఈఓ కార్యాలయంలోని ఉద్యోగస్తులు సమన్వయంతో హెల్మెట్ వాడకంపై అవగాహన ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల చిత్తూరు పరిసరాల ప్రాంతాల్లో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మరణాలు సైతం సంభవిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు తమ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు