అటవీ అమరవీరుల త్యాగాలను స్మరించుకుందామని జన్నారం అటవీశాఖ ఎఫ్డీఓ రామ్మోహన్ రావు సూచించారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం జన్నారం మండల కేంద్రంలోని ఎఫ్డీఓ కార్యాలయం ఆవరణలో అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ అధికారులు, సిబ్బంది ప్రాణ త్యాగాలు చేశారని వారు గుర్తు చేశారు. వారి త్యాగాలు మరువలేనివి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జన్నారం ఎఫ్ఆర్ఓ సుష్మారావు,అటవీ శాఖ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.