ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మరియు తర్లపాడు మండలాలలో గతంలో అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మి స్వయంగా వారి ఇంటికి వెళ్ళి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తర్లపాడు మండలంలో సుమారు 5 మందికి రెండు లక్షల నాలుగు వేల 283 రూపాయలు మార్కాపురం మండలంలో సుమారు ఏడు మందికి 5,87,283 రూపాయలు చెక్కులను బాధితులకు అందజేసినట్లు తెలిపారు.