వ్యవసాయ కార్పొరేటీకరణకు మోడీ సర్కార్ కుట్ర చేస్తుందని దేశీయ సంస్థలు మాదిరి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించి రైతులను కూలీలుగా మార్చే యత్నంలో ఉందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి కొండపర్తి గోవిందరావు ఆరోపించారు. దేశంలో కార్పొరేట్ శక్తులకు అంతర్జాతీయంగా అమెరికా ఆంక్షలకు మోడీ తలొగ్గారని -ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మంజిల్లా సమితి సమావేశం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ అధ్యక్షతన స్థానిక గిరిప్రసాద్ భవన్లో ఆదివారం జరిగింది.