జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ముడి సరుకులు, మ్యాన్ పవర్ అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లభించిన అనుమతులు, వివిధ దశల వారిగా నిర్మాణం పూర్తయిన ఇండ్లకు సంబంధించి వివరాలను మండలాల వారిగా సమీక్షించారు.