పల్నాడు జిల్లా,శావల్యాపురంలో సోమవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. మండలంలోని ఘంటవారిపాలేం చెక్ పోస్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.