పాణ్యంలో వైఎస్సార్సీపీ నేతలు శనివారం రైతుల సమస్యలపై సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నేతృత్వంలో మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి, జిల్లా ఉపాధ్యక్షులు సద్దల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 9న నంద్యాలలోని బొమ్మల సత్రం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. యూరియా, మందుల కొరతపై వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.