పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ధర్నాలు జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సత్తయ్య పాల్గొన్నారు