కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం రంగదాముని చెరువులో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు, జిహెచ్ఎంసి సిబ్బందితో మాట్లాడి నిమజ్జన అనంతరం విగ్రహాల తొలగింపు, వ్యర్ధాల నిర్వహణపై సూచనలు చేశారు. సుమారు 5 ఏళ్లకు పైగా నిమజ్జనాలు జరిగే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ చర్యలు తీసుకున్నామని తెలిపారు.