నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో ఈరోజు జరిగే వినాయకుని శోభాయాత్ర ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల సార్వజని వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు.అంతకు ముందు ముధోల్ లో ప్రధాన విధుల గుండా పోలీసులు కవాతు నిర్వహించారు.జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ భైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ముధోల్ లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ను జరుపుకోవాలని, శోభాయాత్ర లో ఇద్దరు ఎఎస్పీ,6 గురు సిఐ లు 20 మంది ఎస్ఐ లను 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.