మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని శనివారం కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కా రెడ్డి దర్శించుకున్నారు. అంతకుముందు మఠం అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మ దేవికి విశేష కుంకుమార్చన నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. పీఠాధిపతి రాఘవేంద్ర స్వామి జ్ఞాపికను ఇచ్చి ఆశీర్వదించారు. ఆయన వెంట మంత్రాలయం మండల టీడీపీ కన్వీనర్ పన్నాగ వెంకటేష్ స్వామి తదితరులు ఉన్నారు.