అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగమాంబాపురానికి చెందిన పలువురు నేతలు టీడీపీలో చేరారు. మాగుంట లేఔట్ లోని వీపీఆర్ నివాసంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. కొత్త, పాత నాయకులు పార్టీ కోసం పనిచేయాలన్నారు.