పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణాన్ని ఆనుకుని ఉన్న దుద్గసాగరం గ్రామానికి చెందిన ఎం రామారావు అనే 47 ఏళ్ల వ్యక్తి, గ్రామ సమీపంలో ఉన్న వట్టిగెడ్డ నదిని సోమవారం సాయంత్రం పొలంకు వెళ్లి తిరిగి వస్తుండగా, నదిలో ప్రవాహం ఉదృతంగా మారింది. అయితే నదిని దాటేందుకు నదిలో దిగిన రామారావు ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు. పోలీసులు, గ్రామస్తులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం కొట్టిక్కి సమీపంలో అతని మృతదేహం గుర్తించారు.