విశాఖ ఉక్కు ప్రైవేటుకరణకు రాష్ట్రంలో ఉన్న టిడిపి జనసేన వైసిపి పార్టీలు పూర్తిస్థాయిలో వ్యతిరేకించాలని బిఎస్పి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ అన్నారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. పవన్ కళ్యాణ్ మైకు పట్టుకుంటే ఊగిపోతారని ప్రధానికి ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు ఎంతోమంది ప్రాణత్యాగం ఫలంగా విశాఖ ఉక్కు వచ్చిందని దీనిపై మూడు పార్టీలు తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలని డిమాండ్ చేశారు