హైదరాబాద్ నుండి శుక్రవారం నారాయణపేటకు వచ్చిన సిఐడి ఎస్పీ అనన్య కు నారాయణపేట అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్, డిసిఆర్బి ఎస్ఐ సునీత పదకొండున్నర గంటల సమయంలో పూల మొక్క అందించి స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ను కలిశారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సి టీం పోలీసులు, భరోసా సెంటర్ బృందం, పోలీసు కళా బృందం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సిటీం లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మహిళలు విద్యార్థినీల భద్రతపై నారాయణపేట జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలు చేశారు.