శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గం నల్లచెరువు మండలంలో శుక్రవారం ఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లచెరువులో మూడు రోజులపాటు పూజలు అందుకున్న గణనాధులను మండప నిర్వాహకులు విశేషంగా అలంకరించి ట్రాక్టర్ల ద్వారా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ మహిళలు కోలాటాలు నిర్వహిస్తూ ఉట్టికొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.