*సిపిఐ(యం.యల్ ) లిబరేషన్ లో చిత్తూరు జిల్లాలో పలువురు చేరిక* సీనియర్ కమ్యూనిస్టు నాయకులు సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది కార్యకర్తలు సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శి బి బంగార్రావు సమక్షంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరులోని రవి వొకేషనల్ జూనియర్ కాలేజీలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బంగార్రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉదయ్ కిరణ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శి బంగార్రావు గారు జెండా ఆవిష్కరించి సమావేశాన్ని ప్రారంభించారు.