యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి శనివారం ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు వాటర్ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం రామన్నపేట మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు పలువురికి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.