అనంతపురం నగర శివారులోని అనంతపురం రూరల్ మండల పరిధిలో ఉన్న కృష్ణం రెడ్డి పల్లి వద్ద గుంతకల్లుకు చెందిన హనుమంతు అనే కార్మికుడు విషపు పురుగు కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తోటి కార్మికులు అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందన్నారు.