- క్షేత్ర స్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన అదికారులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ గత నెల 27వ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమిష్టి కృషితో 3 రోజుల నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదివారం సాయంత్రం7-3 0 👍గంటలప్రాంతంలోఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 3500 పైగా గణేష్ మండపాల నుండి విగ్రహాలు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేయబడ్డాయిని నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఆరోగ్యశాఖలు సహకారంతో సమన్వయంగా పనిచేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు.