దిలావార్పూర్ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం జాతీయ క్రీడాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం పి.సదానందం, వ్యాయామ ఉపాధ్యాయుడు అంబాజీ, తెలుగు ఉపాధ్యాయుడు సాయన్నతో పాటు పలువురు మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.