జిల్లా మార్కాపురం పట్టణంలోని సిఐ కార్యాలయం నందు పార్లమెంటు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చిత్రపటాన్ని పెట్రోలు పోసి కాల్చి నిరసన తెలిపిన బిజెపి నాయకుల పై కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ వినతి పత్రం అందజేశారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడికి భారత రాజ్యాంగం ఒక క్యాబినెట్ మంత్రి హోదా కలిగినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ చిత్రపటాన్ని కాలుస్తూ కాళ్లతో తొక్కుతూ ఇలాంటి అఘైత్యానికి పాల్పడినటువంటి బిజెపి నాయకులు పై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిఐని కోరినట్లు తెలిపారు.