మోడీ ప్రభుత్వంతోనే మహిళలకు రక్షణ, సామాజిక న్యాయం జరుగుతుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. శనివారం అమరచింతలో మహిళా దినోత్సవంలో భాగంగా వివిధ రంగాల్లో పనిచేస్తూ స్వయం ఉపాధి తదితర రంగాల్లో రాణిస్తున్న మహిళలకు డీకే అరుణ సాయంత్రం ఐదు గంటలకు సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశ్వాంబర పథకం ద్వారా స్వయం ఉపాధిలో రాణించే వారికి అండగా నిలిచారని ఆమె అన్నారు. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు కేంద్రం 20 లక్షల వరకు రుణాలు ఇస్తుందని ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు