కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ పట్టుపడ్డ వారిని మంగళవారం సాయంత్రం 7గంటలకు బెండోవర్ చేశారు కరీంనగర్ రూరల్ పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామానికి చెందిన తోడేటి మధు, MD మఖ్బుల్, నెఱువడ్ల మధు, మరియు నగునూర్ గ్రామానికి చెందిన కన్నమల్ల కోటేష్, నేరెళ్ల తిరుపతి అనే వ్యక్తులు నిషేదిత మూడు ముక్కలాట ఆడుతూ పట్టుబడగా, పై వ్యక్తులు మరల ఎలాంటి చట్ట వ్యతిరేక చర్య చేపట్టకుండా కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి లక్ష రూపాయల పూచికత్తు పై వారిని బైండోవర్ చేయడం జరిగిందని కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.