సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో లంబాడి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్ మాట్లాడుతూ తెల్లం వెంకట్రావు సోయం బాబురావు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని తమ ఖండిస్తున్నామని తెలిపారు. నాయకులను కాంగ్రెస్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లంబాడీలకు ఇందిరాగాంధీ చట్టబద్ధత కల్పిస్తూ ఎస్టీ జాబితాలో చేర్చారని తెలిపారు.