సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని జూకల్ మోడల్ డిగ్రీ కళాశాలలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఫ్రెషర్స్ పార్టీ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ద్వితీయ తృతీయ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.నారాయణ, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేష్, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా సంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.