శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో ఆదివారం సాయంత్రం పోలీసులు, మహిళా పోలీసులు శక్తి యాప్పై విస్తృతంగా అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరూ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ యాప్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నవారు డయల్ 100,112,1091,1098,181,1930 నెంబర్లకు సంప్రదించాలన్నారు.