సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్థులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ భూములను అన్యాయంగా దోచుకుంటుందని, ఈ పవర్ స్టేషన్ మాకక్కర్లేదంటూ నినాదాలు చేశారు. ప్రాజెక్టులు పూర్తిచేసి జిల్లాను అభివృద్ధి చేయాలని సూచించారు. సీపీఎం, సీపీఐ జిల్లా నాయకులు, గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వాబయోగేశ్వరరావు పాల్గొన్నారు.