నిర్మల్ రూరల్ మండలం అనంతపేట్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్‌రూమ్, వంటగది, డైనింగ్‌హాల్‌ను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యుత్, తాగునీరు, బాత్రూం వంటి సదుపాయాలు సక్రమంగా వినియోగంలో ఉన్నాయా అనే అంశాన్ని స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రభుత్వ క