సీఎం సహాయ నిధి పేదలకు వరంలాంటిదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను గురువారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఆస్పత్రుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.