సంకల్ప కార్యక్రమంలో భాగంగా 10 రోజులు జిల్లాలో మహిళలకు 5 అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా శిశు సంక్షేమాధికారిని విజయశ్రీ తెలిపారు. మామిడికుదురు మండలం అప్పనపల్లిలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఉచితంగా న్యాయ, రక్షణ, వసతి, వైద్య, కౌన్సిలింగ్ సహాయం అందిస్తున్నామన్నారు. ప్రైవేట్, పబ్లిక్ ప్రాంతాల్లో హింసకు గురైన మహిళలకు అండగా నిలవడమే లక్ష్యమన్నారు.