శనివారం వనపర్తి జిల్లా పెద్దగూడెం లోని మహాత్మ జ్యోతిబాపూలే వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదరపు కలెక్టర్ ప్రిన్సిపల్ తో మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు పరిసరాలు వంటగది నిలువ గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నారా లేదా అని స్వయంగా పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు.