ఈరోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాయ్స్ హాస్టల్ లో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ను భారీ వర్షం కారణంగా వరద నీరు చేరిన పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాతూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు స్వీయ రక్షణ పాటించాలన్నారు