యాడికి మండల కేంద్రంలోని కుంట వీధి లో సీఐ వీరన్న నేతృత్వంలో పోలీసులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ శ్రీరంగా అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 10 మద్యం బాటిళ్ల ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై సీఐ వీరన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.